
దాచేపల్లి: విద్యుత్ వినియోగదారులు తమ బిల్లులను సకాలంలో చెల్లించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు. ఏడీఈ వీరేశ్వరరావు, ఏఏఓ సందీప్ కుమార్, జేఏఓ ఆశీర్వాదం, ఏఈలు భగవాన్, నాగేశ్వరరావు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.
మార్చి నెలతో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో, అలాగే శ్రీరామనవమి పండుగ, చివరి ఆదివారం వంటి సెలవులు ఉండటంతో కార్యాలయాలు మూసివుండే అవకాశం ఉందని తెలిపారు. అందువల్ల వినియోగదారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుగానే కార్యాలయానికి వచ్చి విద్యుత్ బిల్లులు చెల్లించాలని సూచించారు.
