
మాచర్ల పట్టణంలో నిన్న చోటుచేసుకున్న అత్యాచార ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఘటనకు సంబంధించి బాధితురాలి నివాసానికి క్లూజ్ టీం చేరుకుని కీలక ఆధారాలను సేకరిస్తోంది.
ఈ సందర్భంగా వేలిముద్రలు సహా ఇతర ఫోరెన్సిక్ సాక్ష్యాలను సేకరించి పరిశీలనకు పంపిస్తున్నారు.
కేసును అత్యంత ప్రాధాన్యంగా తీసుకున్న పోలీసులు జిల్లా అదనపు ఎస్పీ స్థాయి అధికారిని మాచర్లలోనే మకాం పెట్టించి దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు. నిందితులను త్వరితగతిన గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.
ఈ ఘటనలో తెలిసిన వ్యక్తుల ప్రమేయమా, లేక బయటి వ్యక్తులా అన్న కోణాల్లో పోలీసులు అన్ని అవకాశాలను పరిశీలిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
నిందితులను త్వరగా అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.

