పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సూచనలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర సంక్షేమ కార్పోరేషన్ డైరెక్టర్ మరియు మాచర్ల పట్టణ టిడిపి అధ్యక్షులు కొమెర దుర్గారావు ఆధ్వర్యంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటిస్తూ చట్టబద్ధత కల్పించినందుకు ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కొవ్వొత్తులు వెలిగించారు. ఈ కార్యక్రమంలో కూటమి సభ్యులు, బూత్ ఇంచార్జీలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొమెర దుర్గారావు మాట్లాడుతూ…“అమరావతిని శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించడం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఎన్నో ఏళ్ల ఆకాంక్షలకు ప్రతిఫలం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి కృషి, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి మార్గదర్శకత్వంతో ఈ చారిత్రాత్మక నిర్ణయం సాధ్యమైంది. రాష్ట్ర అభివృద్ధికి అమరావతి కేంద్రబిందువుగా మారనుంది. రైతుల త్యాగాలకు న్యాయం జరిగిన రోజు ఇది. ఎన్డీఏ ప్రభుత్వానికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం” అని…
Author: myapnews9@gmail.com
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దుర్గెంపూడి శశిభూషణ్ రెడ్డి ఆధ్వర్యంలో అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ కేంద్రం ఉభయ సభల్లో బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం లభించడంపై సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కూటమి నాయకులతో పంచుకున్నారు. అనంతరం దీపాలను వెలిగించి బాణాసంచా పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు దుర్గెంపూడి శశిభూషణ్ రెడ్డి మాట్లాడుతూ…“అమరావతి రాజధాని కోసం ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ఆంధ్ర ప్రజల ఆశలు నెరవేరిన చారిత్రాత్మక ఘట్టం ఇది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఐదు కోట్ల ఆంధ్రుల భావోద్వేగాలకు న్యాయం చేసింది. అమరావతి అభివృద్ధితో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తుంది. రైతుల త్యాగాలకు గౌరవం లభించిన రోజు ఇది. ఈ నిర్ణయానికి మద్దతు తెలిపిన…
సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహానేత డా. బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా మాచర్ల పట్టణంలో ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న ఆయన విగ్రహం వద్ద జయంతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఈ వేడుకలకు MRPS, MSPతో పాటు అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరవ్వాలని పిలుపునిచ్చారు. జగ్జీవన్ రామ్ ఆశయాలు, సమానత్వ సందేశం మరింత విస్తరించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.సామాజిక సమానత్వానికి మార్గదర్శకుడైన జగ్జీవన్ రామ్ సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆలోచనలను నేటి తరానికి చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నాయకులు అన్నారు. అందువల్ల అందరూ వీలైనంత వరకు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా MRPS సీనియర్ నాయకులు మాచర్ల దానియల్ మాదిగ, మండల ఇంచార్జి మాచర్ల రూబెన్ మాదిగ సంయుక్తంగా పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి దేవతలు నడయాడిన దివ్య భూమి అని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. అమరావతిని ఏపీకి శాశ్వత, ఏకైక రాజధానిగా ప్రకటిస్తూ కేంద్ర ఉభయ సభల్లో బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం లభించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా శనివారం వెల్దుర్తిలోని స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జూలకంటి ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు. బాణాసంచా పేల్చి, కూటమి పార్టీల శ్రేణులకు మిఠాయిలు పంచారు. దీపాలు వెలిగించి, అమరావతి ఎప్పటికీ వెలుగొందుతూ ఏపీ అభివృద్ధికి కేంద్రబిందువుగా నిలవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఏపీ రాజధాని అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించిన ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు వెల్దుర్తి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. “జై అమరావతి” నినాదాలతో కార్యక్రమం హోరెత్తింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ కేక్ తినిపించి వారితో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు ఎమ్మెల్యే.
వెల్దుర్తి క్యాంప్ కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన ప్రజాదర్భార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.అర్జీలను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే, సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు.ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగానే, ఆయన ప్రశాంతంగా విని తక్షణ చర్యలు తీసుకోవడంతో సంతృప్తి వ్యక్తం చేశారు.
మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై ప్రస్తుత ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. వెల్దుర్తి టీడీపీ క్యాంప్ కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన తీవ్ర ఆరోపణలు గుప్పించారు.గత ఐదు సంవత్సరాల్లో తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారని, కార్యాలయాలు, ఇళ్లు, వాహనాలు ధ్వంసం చేశారని ఎమ్మెల్యే ఆరోపించారు.“తప్పుడు కేసులు మాది కాదు… మీ పాలనలోనే మా కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారు… చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటాం…” అని స్పష్టం చేశారు. అదేవిధంగా కండ్లకుంట – కొత్త పుల్లారెడ్డిగూడెం గ్రామాల మధ్య అక్రమంగా చెరువు ఏర్పాటు చేసి ప్రభుత్వ కరెంటుతో నీళ్లు అమ్ముకున్నారని ఆరోపించారు. భూకబ్జాలు, బినామీల వివరాలు త్వరలో బయటపెడతామని హెచ్చరించారు.“మీ అక్రమాలన్నీ బయటపెడతాం… ప్రజలను మోసం చేసిన వారిని వదిలిపెట్టం…” అని ఎమ్మెల్యే తీవ్రంగా వ్యాఖ్యానించారు.మాచర్ల నియోజకవర్గ అభివృద్ధి చూసి ఓర్వలేకపోతున్నారని విమర్శించిన ఆయన… అక్రమ చర్యలు ఆపకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు.వరిక పుడిసెల…
టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడుపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు అని పల్నాడు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. పల్నాడు జిల్లాలో ఆయన ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నేతలు టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు వ్యవహార శైలిపై నిరసన వ్యక్తం చేశారు. బి.ఆర్. నాయుడు అనైతిక కార్యకలాపాలతో టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తూ, ఆయనకు సద్బుద్ధి కలగాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ పవిత్రతను కాపాడేందుకు బి.ఆర్. నాయుడును వెంటనే చైర్మన్ పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గ పరిశీలకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు గారు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. దుర్గి మండలానికి చెందిన శ్రీపత్తి అమరేంద్ర (30) పాల వ్యాపారం చేస్తూ ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర అప్పుల పాలైనట్లు సమాచారం. తెలిసిన వారి బంగారాన్ని బ్యాంకులో పెట్టి నగదు తీసుకున్నప్పటికీ, ఆ బంగారాన్ని తిరిగి విడిపించకపోవడంతో పాటు సుమారు రూ.20 నుండి 25 లక్షల వరకు అప్పులు ఉన్నట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లో కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న అమరేంద్ర, దుర్గి నుంచి సంతమాగులూరు వచ్చి తన స్నేహితుడి వద్ద కారు తీసుకుని వెళ్లినట్లు సమాచారం.ఆయనతో పాటు భార్య త్రివేణి (22), పిల్లలు హర్షవర్ధన్ (5), ధర్నాశ్రీ (3) ఉన్నట్లు గుర్తించారు. అప్పుల భారంతో ఈ కుటుంబం తీసుకున్న ఈ తీవ్ర నిర్ణయం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం
గత 20 ఏళ్ల కాలంలో మాచర్ల నియోజకవర్గంలోని రైతుల అభివృద్ధి కోసం చిత్తశుద్ధితో పని చేశామని మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు.మాచర్లలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గ వ్యాప్తంగా సుమారు రూ.175 కోట్ల వ్యయంతో 45 గ్రామాల్లో రైతుల కోసం విద్యుత్ సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అదేవిధంగా 59 కిలోమీటర్ల మేర కొత్త 3-ఫేస్ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు.మారుమూల గ్రామాల్లోని రైతులకు ప్రభుత్వ సేవలను చేరువ చేసేందుకు గ్రామగ్రామాన రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సహకారంతో రూ.100 కోట్ల వ్యయంతో అనుపు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసి, సుమారు 10 వేల ఎకరాలకు సాగునీరు అందించినట్లు పేర్కొన్నారు.అదేవిధంగా వరికపుడిసెల నిర్మాణానికి తమ హయాంలో అనుమతులు సాధించి, కరోనా కాలాన్ని మినహాయిస్తే కేవలం మూడు సంవత్సరాల్లోనే పనులు ప్రారంభించినట్లు చెప్పారు.తాము అధికారంలో ఉన్న సమయంలో…
