
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి సూచనలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర సంక్షేమ కార్పోరేషన్ డైరెక్టర్ మరియు మాచర్ల పట్టణ టిడిపి అధ్యక్షులు కొమెర దుర్గారావు ఆధ్వర్యంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అమరావతిని శాశ్వత రాజధానిగా ప్రకటిస్తూ చట్టబద్ధత కల్పించినందుకు ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కొవ్వొత్తులు వెలిగించారు. ఈ కార్యక్రమంలో కూటమి సభ్యులు, బూత్ ఇంచార్జీలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొమెర దుర్గారావు మాట్లాడుతూ…
“అమరావతిని శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించడం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఎన్నో ఏళ్ల ఆకాంక్షలకు ప్రతిఫలం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గారి కృషి, ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి మార్గదర్శకత్వంతో ఈ చారిత్రాత్మక నిర్ణయం సాధ్యమైంది. రాష్ట్ర అభివృద్ధికి అమరావతి కేంద్రబిందువుగా మారనుంది. రైతుల త్యాగాలకు న్యాయం జరిగిన రోజు ఇది. ఎన్డీఏ ప్రభుత్వానికి మనస్పూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం” అని తెలిపారు.
