
టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడుపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటు అని పల్నాడు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు.
పల్నాడు జిల్లాలో ఆయన ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ నేతలు టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు వ్యవహార శైలిపై నిరసన వ్యక్తం చేశారు. బి.ఆర్. నాయుడు అనైతిక కార్యకలాపాలతో టీటీడీ పవిత్రతను దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తూ, ఆయనకు సద్బుద్ధి కలగాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

టీటీడీ పవిత్రతను కాపాడేందుకు బి.ఆర్. నాయుడును వెంటనే చైర్మన్ పదవి నుంచి తొలగించాలని వైఎస్సార్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గ పరిశీలకులు కొమ్మినేని వెంకటేశ్వర్లు గారు, వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.
