
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దుర్గెంపూడి శశిభూషణ్ రెడ్డి ఆధ్వర్యంలో అమరావతిని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తిస్తూ కేంద్రం ఉభయ సభల్లో బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం లభించడంపై సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి కూటమి నాయకులతో పంచుకున్నారు. అనంతరం దీపాలను వెలిగించి బాణాసంచా పేల్చి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టీడీపీ నాయకుడు దుర్గెంపూడి శశిభూషణ్ రెడ్డి మాట్లాడుతూ…
“అమరావతి రాజధాని కోసం ఎన్నో సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న ఆంధ్ర ప్రజల ఆశలు నెరవేరిన చారిత్రాత్మక ఘట్టం ఇది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఐదు కోట్ల ఆంధ్రుల భావోద్వేగాలకు న్యాయం చేసింది. అమరావతి అభివృద్ధితో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళ్తుంది. రైతుల త్యాగాలకు గౌరవం లభించిన రోజు ఇది. ఈ నిర్ణయానికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం” అని అన్నారు.
