
పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. దుర్గి మండలానికి చెందిన శ్రీపత్తి అమరేంద్ర (30) పాల వ్యాపారం చేస్తూ ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర అప్పుల పాలైనట్లు సమాచారం. తెలిసిన వారి బంగారాన్ని బ్యాంకులో పెట్టి నగదు తీసుకున్నప్పటికీ, ఆ బంగారాన్ని తిరిగి విడిపించకపోవడంతో పాటు సుమారు రూ.20 నుండి 25 లక్షల వరకు అప్పులు ఉన్నట్లు తెలిసింది.
ఈ పరిస్థితుల్లో కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న అమరేంద్ర, దుర్గి నుంచి సంతమాగులూరు వచ్చి తన స్నేహితుడి వద్ద కారు తీసుకుని వెళ్లినట్లు సమాచారం.
ఆయనతో పాటు భార్య త్రివేణి (22), పిల్లలు హర్షవర్ధన్ (5), ధర్నాశ్రీ (3) ఉన్నట్లు గుర్తించారు.
అప్పుల భారంతో ఈ కుటుంబం తీసుకున్న ఈ తీవ్ర నిర్ణయం స్థానికంగా ఆందోళన కలిగిస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం
