
సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహానేత డా. బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా మాచర్ల పట్టణంలో ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న ఆయన విగ్రహం వద్ద జయంతి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ఈ వేడుకలకు MRPS, MSPతో పాటు అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరవ్వాలని పిలుపునిచ్చారు. జగ్జీవన్ రామ్ ఆశయాలు, సమానత్వ సందేశం మరింత విస్తరించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
సామాజిక సమానత్వానికి మార్గదర్శకుడైన జగ్జీవన్ రామ్ సేవలను స్మరించుకుంటూ, ఆయన ఆలోచనలను నేటి తరానికి చేరవేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని నాయకులు అన్నారు. అందువల్ల అందరూ వీలైనంత వరకు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా MRPS సీనియర్ నాయకులు మాచర్ల దానియల్ మాదిగ, మండల ఇంచార్జి మాచర్ల రూబెన్ మాదిగ సంయుక్తంగా పిలుపునిచ్చారు.
