
ఏపీ రాజధాని అమరావతికి శాశ్వత చట్టబద్ధత కల్పించిన ఎన్డీఏ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు వెల్దుర్తి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు.
“జై అమరావతి” నినాదాలతో కార్యక్రమం హోరెత్తింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
అందరికీ కేక్ తినిపించి వారితో కలిసి ఆనందాన్ని పంచుకున్నారు ఎమ్మెల్యే.

