
వెల్దుర్తి క్యాంప్ కార్యాలయంలో ఈ రోజు నిర్వహించిన ప్రజాదర్భార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు.
అర్జీలను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే, సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యలను వెంటనే పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు.
ప్రజలు తమ సమస్యలను నేరుగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగానే, ఆయన ప్రశాంతంగా విని తక్షణ చర్యలు తీసుకోవడంతో సంతృప్తి వ్యక్తం చేశారు.

