మాచర్ల మండలం అలుగురాజుపల్లి వద్ద ఉన్న న్యూటన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ యువత బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాంకేతిక విప్లవాన్ని తీసుకువస్తోందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆధునిక విజ్ఞానం, నైపుణ్యాలతో కూడిన శిక్షణ కార్యక్రమాలు విద్యార్థులకు విస్తృత ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని ఆయన తెలిపారు. సాంకేతిక విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి పెంపొందించుకోవడం ద్వారా యువత ప్రపంచ స్థాయి పోటీలో ముందుండగలరని సూచించారు.విద్యార్థులు లక్ష్యసాధనకు కృషి చేయాలని, సమాజానికి ఉపయోగపడేలా తమ ప్రతిభను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Author: myapnews9@gmail.com
మాచర్ల పట్టణంలోని వీవీఎన్ గార్డెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మరియు ICAR – భారతీయ వరి పరిశోధన సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ తెగల ఉప ప్రణాళిక పథకం కింద వ్యవసాయ ఇన్పుట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన ఎస్టీ రైతులకు 400 బ్యాటరీ స్ప్రేయర్లు, 400 టార్పాలిన్ పట్టాలు ను మాచర్ల ఎమ్మెల్యే శ్రీ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు అందజేశారు.ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా వ్యవసాయ అధికారి ఎం. జగ్గారావు, మాచర్ల సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు వి. జగదీశ్వర రెడ్డి, భారతీయ వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు డా. ఎం.బి.బి. ప్రసాద్ బాబు, డా. ఎం.ఎస్. అనంత, డా. వై. శ్రీధర్ పాల్గొన్నారు.అలాగే మాచర్ల నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల వ్యవసాయ అధికారులు డి. పాప కుమారి, టి. బాలాజీ గంగాధర్, వై. అమీర్ రెడ్డి,…
సృష్టిలో తొలి స్థానం తల్లిదే – మహిళల అభివృద్ధికి టీడీపీ కృషి : ఎమ్మెల్యే జూలకంటి మాచర్ల ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ సృష్టిలో మొదటి స్థానం తల్లిదేనని ఆయన అన్నారు. ప్రతి స్త్రీ ఒక మాతృమూర్తి అని, సమాజ నిర్మాణంలో మహిళల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు.మన సంస్కృతిలో తల్లి, తండ్రి, గురువు, దైవం అనే క్రమంలో తల్లికి తొలి స్థానాన్ని ఇచ్చారని తెలిపారు. ప్రతి బిడ్డకు తొలి గురువు తల్లేనని, చిన్నప్పటి నుంచే నడవడం, మాట్లాడడం వంటి జీవన విలువలను నేర్పేది తల్లేనని చెప్పారు.కుటుంబ వ్యవస్థలో గానీ, సమాజ వ్యవస్థలో గానీ మహిళల పాత్ర ఎంతో ముఖ్యమని ఆయన అన్నారు. ఒక మంచి అధికారి, సమాజ సేవకుడు, రాజకీయ నాయకుడు లేదా ఉద్యోగి సమాజానికి అందుబాటులోకి రావడానికి వారి వెనుక ఒక…
మాచర్ల ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మున్సిపల్ కమిషనర్ వేణుబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.మహిళల సాధికారత కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వాటిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్య, ఉపాధి, వ్యాపార రంగాల్లో మహిళలు ముందుకు వచ్చి తమ ప్రతిభను నిరూపించుకోవాలని ఆకాంక్షించారు.సమాజ పురోగతికి మహిళల భాగస్వామ్యం అత్యంత అవసరమని పేర్కొంటూ మహిళలు ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో రాణించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.
మాచర్ల ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సఖి వన్ స్టాప్ సెంటర్ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల ప్రదర్శన స్టాళ్లను ఎమ్మెల్యే పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సీమంతం వేడుకల్లో పాల్గొని గర్భిణీ మహిళలకు దీవెనలు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం కూడా నిర్వహించారు.అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ మహిళల అభివృద్ధి, సాధికారత కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రమాదవశాత్తు కాళ్లు కోల్పోయిన వారికి ఉచితంగా కృత్రిమ పాదాలు అందించేందుకు ఎంపిక శిబిరాన్ని ఈ నెల 17వ తేదీన నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.ఎన్ఆర్ఐవీఏ అమెరికా వారి ఆర్థిక సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఓరుగంటి చెన్నకేశవరావు, పఠాన్ నాగూర్ వలి శుక్రవారం వెల్లడించారు.పట్టణంలోని కెసిపి స్టోర్స్ పక్కన ఉన్న డా. వెలగపూడి లక్ష్మణ్ దత్ ఆడిటోరియంలో ఈ శిబిరం నిర్వహించనున్నట్లు తెలిపారు. కంభం రోటరీ ట్రస్ట్, రోటరీ క్లబ్, వాసవి క్లబ్, కెసిపి లిమిటెడ్ మాచర్ల వారి సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు.మాచర్లతో పాటు పరిసర గ్రామాల వికలాంగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. పేర్ల నమోదు కోసం ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకురావాలని సూచించారు.ముందస్తు నమోదు కోసం 9849065882, 9440002432 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.
పలనాడు ప్రాంత ప్రజల ఇలవేల్పుగా పేరుగాంచిన శ్రీ నిదానంపాటి అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డిని ఘనంగా సన్మానించారు.అనంతరం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ పలనాడు ప్రాంత ప్రజలకు నిదానంపాటి అమ్మవారు ఎంతో ఆరాధ్య దేవతగా నిలిచారని తెలిపారు. అమ్మవారి కృపతో ప్రాంత ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. తిరునాళ్ల నిర్వహణకు కృషి చేస్తున్న దేవస్థాన కమిటీ సభ్యులను అభినందించారు.
పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో 2001–2002 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు మేకల బిక్షం పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన తన విద్యార్థి దశలోని తీపి జ్ఞాపకాలను తోటి మిత్రులు, ఉపాధ్యాయులతో పంచుకున్నారు. పాత స్మృతులను గుర్తు చేసుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు.అదేవిధంగా పాఠశాల అభివృద్ధికి తన వంతుగా రూ.1 లక్ష ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఒక గ్రామ సమస్యను టీడీపీ నేత నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దాదాపు ఐదేళ్లుగా కొనసాగుతున్న ఆ సమస్యను గతంలో పలుమార్లు జగన్ ప్రభుత్వానికి తెలియజేసినా పరిష్కారం కాలేదని ఆయన పేర్కొన్నట్లు చెబుతున్నారు.అయితే లోకేష్ సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడిన వెంటనే ఆ శాఖ నుంచి కేవీపీకి ఫోన్ వచ్చిందని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారని సమాచారం. త్వరలో శాఖ ముఖ్య కార్యదర్శి వచ్చి వివరాలు చెబుతారని చెప్పినప్పుడు కేవీపీ ఆశ్చర్యానికి గురయ్యారని అంటున్నారు.ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత ప్రజల సమస్యలపై స్పందించే నాయకుడు లోకేష్ అని కేవీపీ వ్యాఖ్యానించినట్లు అక్కడ ఉన్నవారు చెబుతున్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో మహిళల ఆరోగ్యం, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.అలాగే అభ్యుదయం కార్యక్రమం ద్వారా మహిళలకు రుణాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. క్లస్టర్ విధానంలో ప్రతి గ్రామంలో మహిళా వ్యాపారవేత్తలను తయారు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వివరించారు.
