







మాచర్ల మండలం అలుగురాజుపల్లి వద్ద ఉన్న న్యూటన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించిన సిల్వర్ జూబ్లీ వేడుకల్లో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ యువత బంగారు భవిష్యత్తు కోసం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాంకేతిక విప్లవాన్ని తీసుకువస్తోందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఆధునిక విజ్ఞానం, నైపుణ్యాలతో కూడిన శిక్షణ కార్యక్రమాలు విద్యార్థులకు విస్తృత ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని ఆయన తెలిపారు. సాంకేతిక విద్యతో పాటు నైపుణ్యాభివృద్ధి పెంపొందించుకోవడం ద్వారా యువత ప్రపంచ స్థాయి పోటీలో ముందుండగలరని సూచించారు.
విద్యార్థులు లక్ష్యసాధనకు కృషి చేయాలని, సమాజానికి ఉపయోగపడేలా తమ ప్రతిభను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
