






మాచర్ల ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన సఖి వన్ స్టాప్ సెంటర్ భవనాన్ని స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన చేనేత వస్త్రాల ప్రదర్శన స్టాళ్లను ఎమ్మెల్యే పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సీమంతం వేడుకల్లో పాల్గొని గర్భిణీ మహిళలకు దీవెనలు అందజేశారు. కార్యక్రమంలో భాగంగా జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం కూడా నిర్వహించారు.
అదే ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ మహిళల అభివృద్ధి, సాధికారత కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
