
మాచర్ల పట్టణంలోని వీవీఎన్ గార్డెన్స్ లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మరియు ICAR – భారతీయ వరి పరిశోధన సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో షెడ్యూల్డ్ తెగల ఉప ప్రణాళిక పథకం కింద వ్యవసాయ ఇన్పుట్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మాచర్ల నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాలకు చెందిన ఎస్టీ రైతులకు 400 బ్యాటరీ స్ప్రేయర్లు, 400 టార్పాలిన్ పట్టాలు ను మాచర్ల ఎమ్మెల్యే శ్రీ జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా వ్యవసాయ అధికారి ఎం. జగ్గారావు, మాచర్ల సబ్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు వి. జగదీశ్వర రెడ్డి, భారతీయ వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు డా. ఎం.బి.బి. ప్రసాద్ బాబు, డా. ఎం.ఎస్. అనంత, డా. వై. శ్రీధర్ పాల్గొన్నారు.
అలాగే మాచర్ల నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల వ్యవసాయ అధికారులు డి. పాప కుమారి, టి. బాలాజీ గంగాధర్, వై. అమీర్ రెడ్డి, కె. లక్ష్మా రెడ్డి, పి. నరసింహా రావు గార్లు, స్థానిక నాయకులు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
