





పలనాడు ప్రాంత ప్రజల ఇలవేల్పుగా పేరుగాంచిన శ్రీ నిదానంపాటి అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డిని ఘనంగా సన్మానించారు.
అనంతరం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ పలనాడు ప్రాంత ప్రజలకు నిదానంపాటి అమ్మవారు ఎంతో ఆరాధ్య దేవతగా నిలిచారని తెలిపారు. అమ్మవారి కృపతో ప్రాంత ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. తిరునాళ్ల నిర్వహణకు కృషి చేస్తున్న దేవస్థాన కమిటీ సభ్యులను అభినందించారు.
