




పల్నాడు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో 2001–2002 విద్యా సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యుడు మేకల బిక్షం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన తన విద్యార్థి దశలోని తీపి జ్ఞాపకాలను తోటి మిత్రులు, ఉపాధ్యాయులతో పంచుకున్నారు. పాత స్మృతులను గుర్తు చేసుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు.
అదేవిధంగా పాఠశాల అభివృద్ధికి తన వంతుగా రూ.1 లక్ష ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు.
