
మాచర్ల ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో మున్సిపల్ కమిషనర్ వేణుబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహిళలను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు.
మహిళల సాధికారత కోసం ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వాటిని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్య, ఉపాధి, వ్యాపార రంగాల్లో మహిళలు ముందుకు వచ్చి తమ ప్రతిభను నిరూపించుకోవాలని ఆకాంక్షించారు.
సమాజ పురోగతికి మహిళల భాగస్వామ్యం అత్యంత అవసరమని పేర్కొంటూ మహిళలు ఆత్మవిశ్వాసంతో అన్ని రంగాల్లో రాణించాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.
