
మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఒక గ్రామ సమస్యను టీడీపీ నేత నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. దాదాపు ఐదేళ్లుగా కొనసాగుతున్న ఆ సమస్యను గతంలో పలుమార్లు జగన్ ప్రభుత్వానికి తెలియజేసినా పరిష్కారం కాలేదని ఆయన పేర్కొన్నట్లు చెబుతున్నారు.
అయితే లోకేష్ సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడిన వెంటనే ఆ శాఖ నుంచి కేవీపీకి ఫోన్ వచ్చిందని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారని సమాచారం. త్వరలో శాఖ ముఖ్య కార్యదర్శి వచ్చి వివరాలు చెబుతారని చెప్పినప్పుడు కేవీపీ ఆశ్చర్యానికి గురయ్యారని అంటున్నారు.
ఈ సందర్భంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత ప్రజల సమస్యలపై స్పందించే నాయకుడు లోకేష్ అని కేవీపీ వ్యాఖ్యానించినట్లు అక్కడ ఉన్నవారు చెబుతున్నారు.
