
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో మహిళల ఆరోగ్యం, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. స్వర్ణ గ్రామ ఆరోగ్య దర్శిని కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.
అలాగే అభ్యుదయం కార్యక్రమం ద్వారా మహిళలకు రుణాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. క్లస్టర్ విధానంలో ప్రతి గ్రామంలో మహిళా వ్యాపారవేత్తలను తయారు చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ వివరించారు.
