Author: myapnews9@gmail.com

మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి మరియు మాచర్ల పట్టణ టిడిపి అధ్యక్షుడు కొమెర దుర్గారావు ఆదేశాల మేరకు పట్టణంలోని 10వ వార్డు పరిధిలో స్వీట్ లైట్లు ఏర్పాటు చేశారు.95వ బూత్ పరిధిలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బూత్ ఇన్‌చార్జ్ ఉప్పుతోళ్ల చెన్నకేశవులు ఆధ్వర్యంలో స్వీట్ లైట్లు వెలిగించారు.ఈ కార్యక్రమంలో బూత్ కో-ఇన్‌చార్జ్ పీట్ల రామాంజి, శ్రీనివాసరావు మరియు వార్డు కార్యకర్తలు పాల్గొన్నారు. వార్డులో ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు.

Read More

రాష్ట్రంలోని పాఠశాలల్లో వేసవి దృష్ట్యా మార్చి 16 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు.ఆదేశాల ప్రకారం పాఠశాలలు ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు నిర్వహించబడతాయి. అనంతరం విద్యార్థులకు 12:30 గంటలకు మధ్యాహ్న భోజనం అందజేస్తారు.పదో తరగతి పరీక్ష కేంద్రాలుగా ఉన్న పాఠశాలలు మాత్రం మధ్యాహ్నం 1:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు కొనసాగుతాయని తెలిపారు. పరీక్షలున్నంతకాలం 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.ఇక వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు ఉంటాయని, జూన్ 12 నుంచి 2026–27 విద్యాసంవత్సరం ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.అదేవిధంగా రంజాన్ సందర్భంగా ఉర్దూ మీడియం పాఠశాలలు మరియు డైట్ కళాశాలల్లో ఫిబ్రవరి 19 నుంచి మార్చి 20 వరకు ఉదయం 8:00 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. మార్చి 20…

Read More

పల్నాడు జిల్లా మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో వేంచేసియున్న శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు ఈ నెల 13న శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ ధర్మకర్త అల్లం కోటిరెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచారి తెలిపారు.బుధవారం ఆలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం బ్రహ్మంగారి కళ్యాణోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. శుక్రవారం ఉదయం 6 గంటలకు స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహిస్తారని చెప్పారు. అనంతరం వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమ్మ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి మేళతాళాలతో కళ్యాణ వేదికపైకి తీసుకువచ్చి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తారని తెలిపారు.సాయంత్రం 6 గంటలకు స్వామివారు, గోవిందమ్మ అమ్మవారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో మహిళల కోలాటాలు, కనకతప్పట్లు మధ్య పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం కులమతాలకు అతీతంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వివరించారు.ఈ కళ్యాణ మహోత్సవ వేడుకల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని…

Read More

పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అంగన్వాడి కేంద్రాలను స్టేట్ ఫుడ్ కార్పొరేషన్ మెంబర్ కాంతారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, సౌకర్యాల గురించి వివరాలు తెలుసుకున్నారు. అలాగే సత్తెనపల్లిలోని సుగాలి కాలనీలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం ఆహారశాలను కూడా పరిశీలించారు.చిన్నారులు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్టేట్ ఫుడ్ కార్పొరేషన్ మెంబర్ కాంతారావు ఆదేశించారు.

Read More

పల్నాడు జిల్లా దాచేపల్లిలోని విద్యుత్ ఉప రెవెన్యూ కార్యాలయాన్ని విద్యుత్ శాఖ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు బుధవారం సందర్శించారు.ఈ సందర్భంగా కార్యాలయంలోని పనితీరును సమీక్షించి విద్యుత్ సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా గత ఆరు నెలలుగా ఉన్న బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అలాగే MATS కేసుల వసూళ్లను వేగవంతం చేయాలని సూచించారు.అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ విద్యుత్ ప్రయోజనాలను వినియోగదారులకు వివరించి అవగాహన కల్పించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఏవో సందీప్ కుమార్, జేఏవో ఆశీర్వాదం, ఈఆర్‌వో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Read More

పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన భవనాలపై కోట్ల రూపాయల ఆస్తి పన్ను బకాయిలు ఉన్నట్లు మున్సిపల్ కమిషనర్ వేణుబాబు తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ కార్యాలయాలపై మొత్తం రూ.3,00,82,562 మేర ఆస్తి పన్ను బకాయిలు ఉన్నట్లు వెల్లడించారు. ఇందులో ముఖ్యంగా PWD విభాగం రూ.1,17,74,827, తాలూకా కార్యాలయం (ఎంఆర్వో కార్యాలయం) రూ.74,59,805, R&B భవన కార్యాలయం రూ.27,63,849, ఎస్‌సి కార్పొరేషన్ రూ.19,80,299, ప్రభుత్వ ఆసుపత్రి రూ.11,36,211 వంటి శాఖలపై ఎక్కువ బకాయిలు ఉన్నట్లు తెలిపారు.అలాగే కేంద్ర ప్రభుత్వానికి చెందిన సౌత్ సెంట్రల్ రైల్వే డిపార్ట్‌మెంట్‌పై రూ.44,01,097, పోస్ట్ ఆఫీస్ భవనంపై రూ.24,20,383 మేర బకాయిలు ఉండగా, మొత్తం రూ.68,21,480 చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు.ఈ బకాయిలు చెల్లించాల్సిందిగా సంబంధిత శాఖలకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు కమిషనర్ వేణుబాబు తెలిపారు. అదేవిధంగా పట్టణ ప్రజల నుంచి కూడా సుమారు రూ.6 కోట్ల ఆస్తి…

Read More

నో స్మోకింగ్ డే సందర్భంగా మాచర్ల మున్సిపాలిటీ ప్రజలకు అవగాహన కల్పించింది. పొగత్రాగడం కేవలం ధూమపానం చేసే వ్యక్తికే కాకుండా అతని చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులు, పిల్లలు మరియు ఇతరులకు కూడా హానికరమని అధికారులు తెలిపారు.పాసివ్ స్మోకింగ్ వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని సూచించారు. బస్టాండ్లు, పార్కులు మరియు ఇతర బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు.మాచర్ల మున్సిపాలిటీ పరిధిలో బహిరంగ ధూమపానాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ వేణుబాబు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తూ పట్టుబడితే నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తామని హెచ్చరించారు.“పొగ త్రాగడం వదులు.. ప్రాణాన్ని నిలుపు” అంటూ ఆరోగ్యకరమైన, పొగరహిత మాచర్ల నిర్మాణానికి ప్రజలు సహకరించాలని మున్సిపాలిటీ అధికారులు పిలుపునిచ్చారు.

Read More

పల్నాడు జిల్లా దాచేపల్లిలోని విజయభాస్కర్ కళ్యాణ మండపంలో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఆపరేషన్) మాచర్ల మరియు పల్నాడు సర్కిల్ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్, నరసరావుపేట అధికారులు హాజరై దాచేపల్లి, పిడుగురాళ్ల ప్రాంతాల ఆపరేషన్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులు పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా రెవెన్యూ వసూళ్లు చాలా తక్కువగా ఉన్నందున వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పిడుగురాళ్ల, దాచేపల్లి ప్రాంతాల అధికారులకు మరియు ఆపరేషన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.అలాగే వినియోగదారులకు పవర్ ఇంటరప్షన్ లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆపరేషన్ సిబ్బంది తమ తమ హెడ్‌క్వార్టర్స్‌లో ఉంటూ వినియోగదారులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.అదేవిధంగా మీటర్ లేకుండా విద్యుత్ వినియోగం చేయవద్దని, విద్యుత్ చౌర్యం చట్టరీత్యా నేరమని తెలిపారు. తనిఖీలలో విద్యుత్ చౌర్యానికి పాల్పడిన వినియోగదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ…

Read More

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా ప్రగతి, అభివృద్ధిపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొని నియోజకవర్గానికి సంబంధించిన కీలక సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రతి లబ్ధిదారునికి అందేలా చూడాలని సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలు, అధికారులను ఆదేశించారు.ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి వారం నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కార్యక్రమం గురించి కూడా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలోని రైతుల సమస్యలు, రహదారుల విస్తరణ, ప్రసిద్ధి గాంచిన దేవాలయాల అభివృద్ధి, స్థానిక యువతకు ఉపాధి కల్పించే పారిశ్రామిక అభివృద్ధిపై ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి చేసిన ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.ఈ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గొట్టిపాటి…

Read More

పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని సుద్ధగుంటల 7వ వార్డుకు చెందిన నందమూరి బాలకృష్ణ వీరాభిమాని, టిడిపి కార్యకర్త కత్తుల వెంకట నారాయణ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకున్న మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదేశాల మేరకు సహాయం అందించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు మాచర్ల పట్టణ టిడిపి అధ్యక్షులు కొమెర దుర్గారావు, కత్తుల వెంకట నారాయణకు రూ.15,000 నగదు సహాయం తో పాటు నిత్యావసర బియ్యం మరియు ఇతర సరుకులు అందజేశారు.ఈ కార్యక్రమంలో కాకుమాను సైదా (సత్తెనపల్లి), కృష్ణవేణి కాలేజీ ప్రిన్సిపాల్ వై.వి. వెంకట రామయ్య , బండ్ల బ్రహ్మం , వెల్ననంటి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

Read More