
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని సుద్ధగుంటల 7వ వార్డుకు చెందిన నందమూరి బాలకృష్ణ వీరాభిమాని, టిడిపి కార్యకర్త కత్తుల వెంకట నారాయణ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుసుకున్న మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదేశాల మేరకు సహాయం అందించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ మరియు మాచర్ల పట్టణ టిడిపి అధ్యక్షులు కొమెర దుర్గారావు, కత్తుల వెంకట నారాయణకు రూ.15,000 నగదు సహాయం తో పాటు నిత్యావసర బియ్యం మరియు ఇతర సరుకులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాకుమాను సైదా (సత్తెనపల్లి), కృష్ణవేణి కాలేజీ ప్రిన్సిపాల్ వై.వి. వెంకట రామయ్య , బండ్ల బ్రహ్మం , వెల్ననంటి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.
