పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో అంగన్వాడి కేంద్రాలను స్టేట్ ఫుడ్ కార్పొరేషన్ మెంబర్ కాంతారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా అంగన్వాడి కేంద్రాల్లో చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, సౌకర్యాల గురించి వివరాలు తెలుసుకున్నారు. అలాగే సత్తెనపల్లిలోని సుగాలి కాలనీలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం ఆహారశాలను కూడా పరిశీలించారు.
చిన్నారులు, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్టేట్ ఫుడ్ కార్పొరేషన్ మెంబర్ కాంతారావు ఆదేశించారు.
