
పల్నాడు జిల్లా దాచేపల్లిలోని విజయభాస్కర్ కళ్యాణ మండపంలో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఆపరేషన్) మాచర్ల మరియు పల్నాడు సర్కిల్ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్, నరసరావుపేట అధికారులు హాజరై దాచేపల్లి, పిడుగురాళ్ల ప్రాంతాల ఆపరేషన్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా రెవెన్యూ వసూళ్లు చాలా తక్కువగా ఉన్నందున వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పిడుగురాళ్ల, దాచేపల్లి ప్రాంతాల అధికారులకు మరియు ఆపరేషన్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.
అలాగే వినియోగదారులకు పవర్ ఇంటరప్షన్ లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆపరేషన్ సిబ్బంది తమ తమ హెడ్‌క్వార్టర్స్‌లో ఉంటూ వినియోగదారులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
అదేవిధంగా మీటర్ లేకుండా విద్యుత్ వినియోగం చేయవద్దని, విద్యుత్ చౌర్యం చట్టరీత్యా నేరమని తెలిపారు. తనిఖీలలో విద్యుత్ చౌర్యానికి పాల్పడిన వినియోగదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ బి. వెంకటేశ్వరరావు, ఈఈ ఎన్. సింగయ్య, ఏఏవో పి. సందీప్ కుమార్, జేఏవో కె. ఆశీర్వాదం, డీఈఈ టి. వీరేశ్వరరావు, లక్ష్మణ్ నాయక్, ఏఈలు భగవాన్, నాగేశ్వరరావు, ఎల్ఐలు, ఈఆర్‌వో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
