
పల్నాడు జిల్లా దాచేపల్లిలోని విద్యుత్ ఉప రెవెన్యూ కార్యాలయాన్ని విద్యుత్ శాఖ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు బుధవారం సందర్శించారు.
ఈ సందర్భంగా కార్యాలయంలోని పనితీరును సమీక్షించి విద్యుత్ సిబ్బందికి పలు సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా గత ఆరు నెలలుగా ఉన్న బకాయిల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అలాగే MATS కేసుల వసూళ్లను వేగవంతం చేయాలని సూచించారు.
అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకం ద్వారా సోలార్ విద్యుత్ ప్రయోజనాలను వినియోగదారులకు వివరించి అవగాహన కల్పించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఏవో సందీప్ కుమార్, జేఏవో ఆశీర్వాదం, ఈఆర్‌వో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
