

నో స్మోకింగ్ డే సందర్భంగా మాచర్ల మున్సిపాలిటీ ప్రజలకు అవగాహన కల్పించింది. పొగత్రాగడం కేవలం ధూమపానం చేసే వ్యక్తికే కాకుండా అతని చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులు, పిల్లలు మరియు ఇతరులకు కూడా హానికరమని అధికారులు తెలిపారు.
పాసివ్ స్మోకింగ్ వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని సూచించారు. బస్టాండ్లు, పార్కులు మరియు ఇతర బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు.
మాచర్ల మున్సిపాలిటీ పరిధిలో బహిరంగ ధూమపానాన్ని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ వేణుబాబు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తూ పట్టుబడితే నిబంధనల ప్రకారం జరిమానా విధిస్తామని హెచ్చరించారు.
“పొగ త్రాగడం వదులు.. ప్రాణాన్ని నిలుపు” అంటూ ఆరోగ్యకరమైన, పొగరహిత మాచర్ల నిర్మాణానికి ప్రజలు సహకరించాలని మున్సిపాలిటీ అధికారులు పిలుపునిచ్చారు.
