

పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపాలిటీ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన భవనాలపై కోట్ల రూపాయల ఆస్తి పన్ను బకాయిలు ఉన్నట్లు మున్సిపల్ కమిషనర్ వేణుబాబు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన వివిధ కార్యాలయాలపై మొత్తం రూ.3,00,82,562 మేర ఆస్తి పన్ను బకాయిలు ఉన్నట్లు వెల్లడించారు. ఇందులో ముఖ్యంగా PWD విభాగం రూ.1,17,74,827, తాలూకా కార్యాలయం (ఎంఆర్వో కార్యాలయం) రూ.74,59,805, R&B భవన కార్యాలయం రూ.27,63,849, ఎస్‌సి కార్పొరేషన్ రూ.19,80,299, ప్రభుత్వ ఆసుపత్రి రూ.11,36,211 వంటి శాఖలపై ఎక్కువ బకాయిలు ఉన్నట్లు తెలిపారు.
అలాగే కేంద్ర ప్రభుత్వానికి చెందిన సౌత్ సెంట్రల్ రైల్వే డిపార్ట్‌మెంట్‌పై రూ.44,01,097, పోస్ట్ ఆఫీస్ భవనంపై రూ.24,20,383 మేర బకాయిలు ఉండగా, మొత్తం రూ.68,21,480 చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు.
ఈ బకాయిలు చెల్లించాల్సిందిగా సంబంధిత శాఖలకు ఇప్పటికే నోటీసులు జారీ చేసినట్లు కమిషనర్ వేణుబాబు తెలిపారు. అదేవిధంగా పట్టణ ప్రజల నుంచి కూడా సుమారు రూ.6 కోట్ల ఆస్తి పన్ను బకాయిలు వసూలు కావాల్సి ఉందన్నారు.
రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ శాఖలు మరియు ప్రజలు సకాలంలో పన్నులు చెల్లిస్తే మాచర్ల పట్టణ అభివృద్ధి మరింత వేగంగా జరుగుతుందని కమిషనర్ వేణుబాబు పేర్కొన్నారు.
