

ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పల్నాడు జిల్లా ప్రగతి, అభివృద్ధిపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పాల్గొని నియోజకవర్గానికి సంబంధించిన కీలక సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.
ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలు, చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ప్రత్యేకంగా చర్చించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రతి లబ్ధిదారునికి అందేలా చూడాలని సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలు, అధికారులను ఆదేశించారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి వారం నిర్వహిస్తున్న ప్రజాదర్బార్ కార్యక్రమం గురించి కూడా ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మాచర్ల నియోజకవర్గంలోని రైతుల సమస్యలు, రహదారుల విస్తరణ, ప్రసిద్ధి గాంచిన దేవాలయాల అభివృద్ధి, స్థానిక యువతకు ఉపాధి కల్పించే పారిశ్రామిక అభివృద్ధిపై ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి చేసిన ప్రతిపాదనలకు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.
ఈ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, పల్నాడు జిల్లాకు చెందిన ఏడు నియోజకవర్గాల శాసనసభ్యులు, జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా, ఎస్పీ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.
