చెన్నకేశవ స్వామి తిరునాళ్ల ఏర్పాట్లపై సమీక్ష – భక్తులకు పోలీసుల సూచనలు పల్నాడు జిల్లా మాచర్లలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం తిరునాళ్ల ఏర్పాట్లపై నిర్వహించిన అధికారుల సమీక్ష సమావేశంలో గురజాల ఇన్‌చార్జ్ డీఎస్పీ వెంకటరమణ మాట్లాడారు. తిరునాళ్ల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. దర్శనం పూర్తైన తర్వాత భక్తులు ఆలయ ప్రాంగణంలో ఎక్కువసేపు ఉండకుండా త్వరగా బయటికి వెళ్లేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.అదేవిధంగా గతంలో ఏర్పాటు చేసిన ప్రదేశాల్లోనే పార్కింగ్ సదుపాయాలు కల్పిస్తామని, భక్తులు మరియు వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అదనంగా మరికొన్ని పార్కింగ్ స్థలాలు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ తిరునాళ్ల సమయంలో పట్టణంలో విస్తృత ప్రచారం చేయాలని సూచించారు. మహిళలు అధికంగా బంగారు నగలు ధరించి రావద్దని ప్రజలకు అవగాహన కల్పించాలని, రథోత్సవం వంటి వేడుకల సమయంలో…
Author: myapnews9@gmail.com
పల్నాడు జిల్లా మాచర్లలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం తిరునాళ్ళ పై నిర్వహించిన అధికారుల సమీక్ష సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బి. వేణుబాబు పలు కీలక విషయాలను వెల్లడించారు.దేవాలయం పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టడంతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపాలిటీ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. తిరుణాల సందర్భంగా మున్సిపాలిటీ నుంచి ఖర్చు చేయడానికి గతంలో రూ.75 వేలుగా ఉన్న నిధిని ఈ సంవత్సరం రూ.1 లక్షకు పెంచాలని మున్సిపల్ చైర్మన్ మధార్ సాహెబ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసినట్లు తెలిపారు.అదేవిధంగా చలువ పందిళ్లు, ఎలక్ట్రికల్ ఏర్పాట్లకు సంబంధించి దేవస్థానం తీర్మానాలను గౌరవ చైర్మన్‌కు అందజేసి అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు. పండుగ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని పాతూరు మెయిన్ రోడ్‌తో పాటు పట్టణంలోని ప్రధాన సెంటర్లలో ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు.శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం…
రెంటచింతలలో బొలెరో ప్రమాదం… 22 మందికి గాయాలుపల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గ పరిధిలోని రెంటచింతల మండలంలో శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దోర్నాల ప్రాంతం నుండి గురజాల మండలం గంగవరానికి మొక్కజొన్న కండలు విరచడానికి వెళ్తున్న కూలీలు ప్రయాణిస్తున్న బొలెరో (దోస్తు) వాహనం రెంటచింతల హైవేపై హోసన్న మందిరం సమీపానికి రాగానే అదుపుతప్పి కిందపడింది.డ్రైవర్ నిద్రమత్తులో ఉండటం వల్ల వాహనాన్ని సరిగా నడపకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. వాహనంలో మొత్తం 25 మంది ప్రయాణిస్తుండగా, వారిలో 22 మందికి గాయాలు అయ్యాయి.గాయపడిన వారిలో ఒక మహిళకు చెవుల నుండి రక్తస్రావం కావడంతో ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని 108 అంబులెన్స్‌లతో పాటు స్థానికుల సహాయంతో ఆటోల ద్వారా గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ వారికి చికిత్స కొనసాగుతోంది.ప్రమాదం అనంతరం వాహన డ్రైవర్ పరారీలో ఉన్నట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు…
ప్రభుత్వ ఉద్యోగి కుమారుడి అర్జీ పరిశీలనమాచర్ల పట్టణానికి చెందిన మందుల పుల్లారావు తాడేపల్లి మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం మంచానికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో మెడికల్ ఇన్వాలిడేషన్ కింద ఆయన కుమారుడు మందుల మల్లిఖార్జున గోపి ఉద్యోగం కోసం మాచర్ల తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు.దీనిపై విచారణ నిమిత్తం మాచర్ల తహసీల్దార్ బి. కిరణ్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ కలిసి స్వయంగా పుల్లారావు నివాసానికి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. సంబంధిత పత్రాలను పరిశీలించిన అనంతరం అర్హతల ఆధారంగా అర్జీదారుడికి ఉద్యోగం సిఫార్సు చేసే విషయాన్ని పరిశీలిస్తామని అధికారులు తెలిపారు
మాచర్ల పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వడ్డెర సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్, మాచర్ల పట్టణ టీడీపీ అధ్యక్షుడు కొమెర దుర్గారావుకు చెందిన స్కార్పియో కారుపై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు.దుండగులు కారుతో వచ్చి దుర్గారావు కారును అడ్డగించి, అద్దాలను పగలగొట్టినట్లు సమాచారం. ఈ ఘటనతో మాచర్ల పట్టణంలో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది.సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాడికి పాల్పడిన కొంతమంది వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.ఈ సందర్భంగా కొమెర దుర్గారావు మాట్లాడుతూ, మాచర్ల పట్టణ అభివృద్ధి కోసం పనిచేస్తున్నాను. అది చూసి ఓర్వలేక వైసీపీ పార్టీకి చెందిన కొంతమంది వ్యక్తులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.తాను బజార్ నుంచి వస్తున్న సమయంలో కారుపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారని తెలిపారు. గతంలో కూడా తన కారును దాడి చేసి తగలబెట్టారని, ఇటీవల ఫ్లెక్సీలు చించివేయడం వంటి ఘటనలు జరిగాయని…
మాచర్ల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షలకు హాజరుకాబోతున్న 229 మంది విద్యార్థినీలకు పరీక్షా సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమాన్ని మాచర్ల పట్టణానికి చెందిన శ్రీ వెంకటేశ్వర బుక్ డిపో యజమాని షరాబు అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి బూసా రామాంజనేయులు (అడ్వకేట్) ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థినీలకు పరీక్షా సామాగ్రిని అందజేశారు.ఈ సందర్భంగా షరాబు అనిల్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు కష్టపడి చదివి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం ఉషారాణి, సీనియర్ ఉపాధ్యాయులు పోలా మల్లికార్జున, కృష్ణబాబు, శ్రీహరి, కొండలు, కటకం నరేష్, ఫారుక్, లక్ష్మణ్, నరసింహ సాయి తదితరులు పాల్గొన్నారు
పల్నాడు జిల్లా దాచేపల్లి సబ్ డివిజన్ మరియు వీఆర్వో కార్యాలయంలో ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్ బిజిలీ యోజన పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ పథకం గృహ వినియోగదారులందరికీ వర్తిస్తుందని అధికారులు తెలిపారు.ఈ పథకం ద్వారా ఒకసారి పెట్టుబడి పెట్టి 25 సంవత్సరాల పాటు ఇంటికి ఉచిత విద్యుత్ పొందవచ్చని, అలాగే ఉత్పత్తి అయిన అదనపు విద్యుత్‌ను విద్యుత్ సంస్థలకు విక్రయించి ఆదాయం కూడా పొందవచ్చని వివరించారు.కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ వివరాలు ఇలా ఉన్నాయి:1 కిలోవాట్‌కు రూ.30,0002 కిలోవాట్‌కు రూ.60,0003 కిలోవాట్‌కు రూ.78,000అలాగే తక్కువ వడ్డీతో బ్యాంకుల ద్వారా రుణాలు కూడా అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.అపార్ట్మెంట్‌లో నివసించే వారికి పర్సనల్ నెట్ మీటరింగ్ విధానం ద్వారా తమ సొంత ఇంటి పై సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి, అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను విద్యుత్ కంపెనీకి ఎక్స్‌పోర్ట్ చేసి అపార్ట్మెంట్‌లో వినియోగించుకునే అవకాశం ఉందని చెప్పారు.సోలార్ రూఫ్‌టాప్…
పల్నాడు జిల్లా రెంటచింతల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో HPV (హ్యూమన్ పాపిలోమా వైరస్) వ్యాక్సిన్ కార్యక్రమాన్ని డాక్టర్ ప్రదీప్ కుమార్, డాక్టర్ రమాదేవి లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ, ఈ వ్యాక్సిన్ భవిష్యత్తులో ఆడపిల్లలకు రొమ్ము క్యాన్సర్ వంటి సమస్యలు రాకుండా నివారించడంలో సహాయపడుతుందని తెలిపారు. ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ 2011 మార్చి నుంచి 2012 ఫిబ్రవరి 28 మధ్య జన్మించిన 14 సంవత్సరాలు నిండిన ఆడపిల్లలకు మాత్రమే ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం అందిస్తున్నట్లు చెప్పారు.ఈ వ్యాక్సిన్ పొందాలనుకునే తల్లిదండ్రులు ముందుగా తమ గ్రామ పరిధిలోని ANM ను సంప్రదించి, ఆడపిల్లల ఆధార్ కార్డు మరియు జనన తేదీ ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. అనంతరం రెంటచింతల పీహెచ్‌సీకి వచ్చి ఈ వ్యాక్సిన్‌ను పూర్తిగా ఉచితంగా పొందవచ్చు.రెంటచింతల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ వ్యాక్సిన్ ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు వేస్తున్నట్లు…
మాచర్ల: రోటరీ క్లబ్ ఆఫ్ మాచర్ల వారి ఆధ్వర్యంలో మాచర్ల నియోజకవర్గంలోని మాచర్ల, దుర్గి, వెల్దుర్తి మండలాలకు చెందిన జిల్లా పరిషత్ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, మోడల్ స్కూల్స్, గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలు మరియు పెద్ద కాన్వెంట్ పాఠశాలల్లో చదువుతున్న పబ్లిక్ పరీక్షలకు హాజరవుతున్న 700 మందికి పైగా విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని పంపిణీ చేశారు.సుమారు రూ.50 వేల విలువైన పరీక్షా సామాగ్రిని ఆయా పాఠశాలలలో విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ వైద్యులు, రోటరీ డిస్ట్రిక్ట్ 3150 డిసీజెస్ అండ్ ప్రివెన్షన్ చైర్మన్ డాక్టర్ కొండవీటి రామకోటయ్య పరీక్షల సమయంలో విద్యార్థులు ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి సూచనలు చేశారు.రోటరీ క్లబ్ ఆఫ్ మాచర్ల ఎలెక్ట్ ప్రెసిడెంట్ పఠాన్ నాగూర్ వలి మాట్లాడుతూ, పబ్లిక్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల ఆశలను నెరవేర్చే విధంగా ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.అలాగే ఎం.బీ.ఎస్.…
మాచర్ల: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధన కోసం 2011 మార్చి 12న ప్రజల ఆశీస్సులతో ఏర్పడిన పార్టీనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పిన్నెల్లి రామా తెలిపారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. గత 16 సంవత్సరాల ప్రయాణంలో అనేక పోరాటాలు, విజయాలు సాధిస్తూ ప్రజల మద్దతుతో ముందుకు సాగుతున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.ఈ సందర్భంగా ముందుగా పార్టీ కార్యాలయం నుండి నాయకులు, కార్యకర్తలు కలిసి బస్టాండ్ సెంటర్‌లోని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్దకు ర్యాలీగా వెళ్లి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు.తరువాత పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
