
ప్రభుత్వ ఉద్యోగి కుమారుడి అర్జీ పరిశీలన
మాచర్ల పట్టణానికి చెందిన మందుల పుల్లారావు తాడేపల్లి మున్సిపల్ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ప్రస్తుతం మంచానికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో మెడికల్ ఇన్వాలిడేషన్ కింద ఆయన కుమారుడు మందుల మల్లిఖార్జున గోపి ఉద్యోగం కోసం మాచర్ల తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు.
దీనిపై విచారణ నిమిత్తం మాచర్ల తహసీల్దార్ బి. కిరణ్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ కలిసి స్వయంగా పుల్లారావు నివాసానికి వెళ్లి పరిస్థితులను పరిశీలించారు. సంబంధిత పత్రాలను పరిశీలించిన అనంతరం అర్హతల ఆధారంగా అర్జీదారుడికి ఉద్యోగం సిఫార్సు చేసే విషయాన్ని పరిశీలిస్తామని అధికారులు తెలిపారు
