



మాచర్ల: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల సాధన కోసం 2011 మార్చి 12న ప్రజల ఆశీస్సులతో ఏర్పడిన పార్టీనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పిన్నెల్లి రామా తెలిపారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ కార్యకర్తలు, అభిమానులకు శుభాకాంక్షలు తెలిపారు. గత 16 సంవత్సరాల ప్రయాణంలో అనేక పోరాటాలు, విజయాలు సాధిస్తూ ప్రజల మద్దతుతో ముందుకు సాగుతున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు.
ఈ సందర్భంగా ముందుగా పార్టీ కార్యాలయం నుండి నాయకులు, కార్యకర్తలు కలిసి బస్టాండ్ సెంటర్‌లోని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్దకు ర్యాలీగా వెళ్లి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు.
తరువాత పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
