
పల్నాడు జిల్లా దాచేపల్లి సబ్ డివిజన్ మరియు వీఆర్వో కార్యాలయంలో ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్ బిజిలీ యోజన పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ పథకం గృహ వినియోగదారులందరికీ వర్తిస్తుందని అధికారులు తెలిపారు.
ఈ పథకం ద్వారా ఒకసారి పెట్టుబడి పెట్టి 25 సంవత్సరాల పాటు ఇంటికి ఉచిత విద్యుత్ పొందవచ్చని, అలాగే ఉత్పత్తి అయిన అదనపు విద్యుత్‌ను విద్యుత్ సంస్థలకు విక్రయించి ఆదాయం కూడా పొందవచ్చని వివరించారు.
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ వివరాలు ఇలా ఉన్నాయి:
1 కిలోవాట్‌కు రూ.30,000
2 కిలోవాట్‌కు రూ.60,000
3 కిలోవాట్‌కు రూ.78,000
అలాగే తక్కువ వడ్డీతో బ్యాంకుల ద్వారా రుణాలు కూడా అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు.
అపార్ట్మెంట్‌లో నివసించే వారికి పర్సనల్ నెట్ మీటరింగ్ విధానం ద్వారా తమ సొంత ఇంటి పై సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేసి, అక్కడ ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను విద్యుత్ కంపెనీకి ఎక్స్‌పోర్ట్ చేసి అపార్ట్మెంట్‌లో వినియోగించుకునే అవకాశం ఉందని చెప్పారు.
సోలార్ రూఫ్‌టాప్ ఏర్పాటుకు సంబంధించిన వివరాల కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1912ను సంప్రదించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఈఈ టి. వీరేశ్వరరావు, ఏఏఓ పి. సందీప్ కుమార్, జేఏఓ కె. ఆశీర్వాదం, ఏఈలు భగవాన్, నాగేశ్వరరావు, శంకర్ రావు, ఆపరేషన్ సిబ్బంది, విఆర్వో అధికారులు మరియు వినియోగదారులు పాల్గొన్నారు. 📰
