
పల్నాడు జిల్లా మాచర్లలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం తిరునాళ్ళ పై నిర్వహించిన అధికారుల సమీక్ష సమావేశంలో మున్సిపల్ కమిషనర్ బి. వేణుబాబు పలు కీలక విషయాలను వెల్లడించారు.
దేవాలయం పరిసర ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టడంతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపాలిటీ తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. తిరుణాల సందర్భంగా మున్సిపాలిటీ నుంచి ఖర్చు చేయడానికి గతంలో రూ.75 వేలుగా ఉన్న నిధిని ఈ సంవత్సరం రూ.1 లక్షకు పెంచాలని మున్సిపల్ చైర్మన్ మధార్ సాహెబ్ ఆధ్వర్యంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసినట్లు తెలిపారు.
అదేవిధంగా చలువ పందిళ్లు, ఎలక్ట్రికల్ ఏర్పాట్లకు సంబంధించి దేవస్థానం తీర్మానాలను గౌరవ చైర్మన్‌కు అందజేసి అవసరమైన సహకారం అందిస్తామని పేర్కొన్నారు. పండుగ వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని పాతూరు మెయిన్ రోడ్‌తో పాటు పట్టణంలోని ప్రధాన సెంటర్లలో ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు.
శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవస్థానం తిరుణాల సందర్భంగా మున్సిపాలిటీ కార్యాలయం నుంచి అన్ని విధాలుగా సహకారం అందిస్తామని కమిషనర్ వేణుబాబు తెలిపారు.
