పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో గురువారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రామాటాకీస్ వీధిలో నివసిస్తున్న షేక్ చిన్న సైదా తన ఇంట్లో టిఫిన్ తయారు చేస్తుండగా, అకస్మాత్తుగా గ్యాస్ లీక్ కారణంగా మంటలు చెలరేగాయి.ఈ ప్రమాదంలో సైదా తీవ్రంగా గాయపడ్డారు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, ఆయన్ని చికిత్స కోసం మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనతో ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. గ్యాస్ వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Author: myapnews9@gmail.com
మాచర్ల పట్టణంలో యువతిపై జరిగిన అత్యాచారం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ ఘటనలో నిందితుడు నామాల శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు.బాధిత యువతికి నిందితుడు ప్రియుడు కావడం ఈ కేసులో కొత్త ట్విస్ట్‌గా మారింది. ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, రాజుపాలెం ప్రాంతంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.అనంతరం నిందితుడిని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, కోర్టులో హాజరుపరచగా జడ్జి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ప్రస్తుతం నిందితుడిని గురజాల సబ్ జైలుకు తరలించారు. ఈ కేసుపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు
పల్నాడు జిల్లా రాయవరం గ్రామంలో నాగార్జునసాగర్ వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ కింద త్రాగునీటి సరఫరా కోసం ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి సంబంధించిన స్థల పరిశీలన చేపట్టారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహశీల్దారు, ఆర్‌డబ్ల్యూఎస్ (RWS) అధికారులు, గ్రామ సర్వేయర్, వీఆర్వో తదితరులు గ్రామంలోని ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత రెవెన్యూ రికార్డులను కూడా అధికారులు పరిశీలించారు.పరిశీలన అనంతరం పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
మీడియా సంస్థలపై రౌడీ మూకలతో కలిసి దాడులకు పాల్పడటం తీవ్రంగా ఖండించదగిన చర్య అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యాగంటి మల్లికార్జునరావు పేర్కొన్నారు. ప్రజా గళాన్ని ప్రతిబింబించే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్‌పై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం ప్రజాస్వామ్యానికి, పత్రికా స్వేచ్ఛకు విరుద్ధమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజధాని అమరావతి అంశంపై జగన్ రెడ్డి వైఖరిని ప్రశ్నించినందుకే మీడియా సంస్థపై భౌతిక దాడులకు దిగడం అప్రజాస్వామికమని యాగంటి విమర్శించారు. మాజీ మంత్రులు సైతం రౌడీ మూకలతో కలిసి ఈ దాడిలో పాల్గొనడం అత్యంత దుర్మార్గమని అన్నారు.ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దాడులకు దిగడం వైసీపీ పార్టీ నైజమని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలకు స్థానం లేదని స్పష్టం చేశారు. “ఏబీఎన్-ఆంధ్రజ్యోతి నిజాలను నిర్భయంగా వెలుగులోకి తెచ్చే నిప్పుకణిక. వాటిని అణచివేయాలని ప్రయత్నించడం అవివేకం” అని యాగంటి పేర్కొన్నారు.జగన్ రెడ్డి తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే, అలాగే సొంత పార్టీలో ఎదురవుతున్న వ్యతిరేకతను దాచిపెట్టడానికే మీడియాపై…
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామ శివారులో ప్రమాదం చోటుచేసుకుంది. గుత్తికొండ బిలం వైపు మట్టిరోడ్డుపై వెళ్తున్న ఒక కారు, మార్గమధ్యంలో ఎక్కువగా ఉన్న కోతులను తప్పించబోయి అదుపు తప్పి నాగార్జునసాగర్ కుడికాల్వలోకి జారిపోయింది.ప్రమాదాన్ని గమనించిన స్థానిక గ్రామస్తులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించింది.ప్రమాదానికి గురైన కారు కారంపూడి ప్రాంతానికి చెందినదిగా సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
పల్నాడు జిల్లా దాచేపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ వెంకట్ నాయక్ మృతి చెందారు. నరసరావుపేట నుండి దాచేపల్లికి టు వీలర్‌పై వస్తుండగా, అకస్మాత్తుగా యూటర్న్ తీసుకుంటున్న లారీని ఆయన ప్రయాణిస్తున్న బైక్ ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో వెంకట్ నాయక్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. స్థానికులు వెంటనే స్పందించి ఆయనను దాచేపల్లిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమంగా ఉండటంతో పిడుగురాళ్ల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలోనే ఆయన మృతి చెందారు.ప్రస్తుతం వెంకట్ నాయక్ వెల్దుర్తి పోలీస్ స్టేషన్‌లో రైటర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనతో పోలీస్ విభాగంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో విషాద ఘటన చోటుచేసుకుంది. మాచర్ల మండలం తాళ్లపల్లి సమీపంలో ఓ తల్లి తన కూతురిని నడుముకి కట్టుకుని నాగార్జునసాగర్ కుడి కాలువలోకి దూకింది.ఈ ఘటనపై స్థానికులు సమాచారం ఇవ్వడంతో విజయపురి సౌత్ ఎస్సై అశోక్ ఆధ్వర్యంలో పోలీసులు వెంటనే గాలింపు చర్యలు ప్రారంభించారు. కొద్ది సేపటి గాలింపులోనే తల్లి, కూతురు మృతదేహాలు బయటపడినట్లు తెలిపారు.మృతదేహాలను మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల వివరాలు, ఈ ఘటనకు దారితీసిన కారణాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
పల్నాడు జిల్లా దాచేపల్లి నుంచి మాచర్లకు వెళ్లే జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా రెంటచింతల మండలం పాలువాయి గ్రామం వద్ద ఉన్న రైల్వే ఎల్‌సీ గేట్ నెం.101 మూసివేయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా బస్సులు గ్రామంలోకి రాకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు.ఈ సమస్యను స్థానిక నాయకులు, ప్రజలు ఈరోజు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు వినతిపత్రం ద్వారా తెలియజేశారు. దీనిపై స్పందించిన ఎంపీ, నిబంధనల ప్రకారం గేట్‌ను తిరిగి తెరవడం సాధ్యం కాదని తెలిపారు. అయితే ప్రజల సౌకర్యార్థం బస్సులు గ్రామంలోకి వచ్చేలా పైబ్రిడ్జి వద్ద ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి చొరవ చూపుతామని హామీ ఇచ్చారు.
పల్నాడు జిల్లాలో సంచలనం రేపిన ఘటన చోటుచేసుకుంది. నరసరావుపేట నుంచి వేములూరుపాడు వెళ్తున్న వ్యక్తి స్కూటీలో ఉంచిన సుమారు రూ.5 లక్షలు చోరీకి గురయ్యాయి.నరసరావుపేట బైపాస్‌లోని జొన్నలగడ్డ హోల్‌సేల్ ఉల్లిపాయ దుకాణం వద్ద ఈ ఘటన జరిగింది. ఉల్లిపాయలు కొనుగోలు చేయడానికి దుకాణంలోకి వెళ్లిన సమయంలో, బయట నిలిపిన స్కూటీలో ఉన్న నగదును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు సమాచారం. ఈ చోరీ ఘటన సీసీటీవీ కెమెరాల్లో నమోదైనట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
