
మీడియా సంస్థలపై రౌడీ మూకలతో కలిసి దాడులకు పాల్పడటం తీవ్రంగా ఖండించదగిన చర్య అని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు యాగంటి మల్లికార్జునరావు పేర్కొన్నారు. ప్రజా గళాన్ని ప్రతిబింబించే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్‌పై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం ప్రజాస్వామ్యానికి, పత్రికా స్వేచ్ఛకు విరుద్ధమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజధాని అమరావతి అంశంపై జగన్ రెడ్డి వైఖరిని ప్రశ్నించినందుకే మీడియా సంస్థపై భౌతిక దాడులకు దిగడం అప్రజాస్వామికమని యాగంటి విమర్శించారు. మాజీ మంత్రులు సైతం రౌడీ మూకలతో కలిసి ఈ దాడిలో పాల్గొనడం అత్యంత దుర్మార్గమని అన్నారు.
ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దాడులకు దిగడం వైసీపీ పార్టీ నైజమని, ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలకు స్థానం లేదని స్పష్టం చేశారు. “ఏబీఎన్-ఆంధ్రజ్యోతి నిజాలను నిర్భయంగా వెలుగులోకి తెచ్చే నిప్పుకణిక. వాటిని అణచివేయాలని ప్రయత్నించడం అవివేకం” అని యాగంటి పేర్కొన్నారు.
జగన్ రెడ్డి తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికే, అలాగే సొంత పార్టీలో ఎదురవుతున్న వ్యతిరేకతను దాచిపెట్టడానికే మీడియాపై దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా మీడియా స్వేచ్ఛను అణచివేయడానికి ప్రయత్నించారని, దాని ఫలితంగానే ఎన్నికల్లో పరాజయం ఎదురైందని అన్నారు.
ఆంధ్రజ్యోతి రాతలు ఎప్పటికీ ప్రజాపక్షమేనని యాగంటి
