
స్థానికులు సమాచారం అందించడంతో విజయపురి సౌత్ ఎస్సై అశోక్ ఆధ్వర్యంలో వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపులో తల్లి ఆరే అమరలింగేశ్వరి (25), కూతురు ఆరే లిథిక (3) మృతదేహాలను వెలికితీశారు. వీరు మాచర్ల పట్టణం ఒకటవ వార్డుకు చెందినవారని గుర్తించారు.
మూడు నెలల క్రితం చిన్న కూతురు యశ్విని (2) అనారోగ్యంతో మృతి చెందడంతో, అప్పటి నుంచి తీవ్ర మనోవేదనలో ఉన్న అమరలింగేశ్వరి ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు భర్త నాగ శివ తెలిపారు.
ఈ ఘటనపై నాగార్జునసాగర్ పోలీసులు బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

