
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం గుత్తికొండ గ్రామ శివారులో ప్రమాదం చోటుచేసుకుంది. గుత్తికొండ బిలం వైపు మట్టిరోడ్డుపై వెళ్తున్న ఒక కారు, మార్గమధ్యంలో ఎక్కువగా ఉన్న కోతులను తప్పించబోయి అదుపు తప్పి నాగార్జునసాగర్ కుడికాల్వలోకి జారిపోయింది.
ప్రమాదాన్ని గమనించిన స్థానిక గ్రామస్తులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను సురక్షితంగా బయటకు తీశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడం ఊరట కలిగించింది.
ప్రమాదానికి గురైన కారు కారంపూడి ప్రాంతానికి చెందినదిగా సమాచారం. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
