
పల్నాడు జిల్లా దాచేపల్లి నుంచి మాచర్లకు వెళ్లే జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా రెంటచింతల మండలం పాలువాయి గ్రామం వద్ద ఉన్న రైల్వే ఎల్‌సీ గేట్ నెం.101 మూసివేయడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా బస్సులు గ్రామంలోకి రాకపోవడంతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు.
ఈ సమస్యను స్థానిక నాయకులు, ప్రజలు ఈరోజు నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుకు వినతిపత్రం ద్వారా తెలియజేశారు.

దీనిపై స్పందించిన ఎంపీ, నిబంధనల ప్రకారం గేట్‌ను తిరిగి తెరవడం సాధ్యం కాదని తెలిపారు. అయితే ప్రజల సౌకర్యార్థం బస్సులు గ్రామంలోకి వచ్చేలా పైబ్రిడ్జి వద్ద ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి చొరవ చూపుతామని హామీ ఇచ్చారు.
