
పల్నాడు జిల్లా రాయవరం గ్రామంలో నాగార్జునసాగర్ వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ కింద త్రాగునీటి సరఫరా కోసం ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మాణానికి సంబంధించిన స్థల పరిశీలన చేపట్టారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహశీల్దారు, ఆర్‌డబ్ల్యూఎస్ (RWS) అధికారులు, గ్రామ సర్వేయర్, వీఆర్వో తదితరులు గ్రామంలోని ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా సంబంధిత రెవెన్యూ రికార్డులను కూడా అధికారులు పరిశీలించారు.
పరిశీలన అనంతరం పూర్తి నివేదికను జిల్లా కలెక్టర్‌కు సమర్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
