
మాచర్ల పట్టణంలో యువతిపై జరిగిన అత్యాచారం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ ఘటనలో నిందితుడు నామాల శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు.
బాధిత యువతికి నిందితుడు ప్రియుడు కావడం ఈ కేసులో కొత్త ట్విస్ట్‌గా మారింది. ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించి, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, రాజుపాలెం ప్రాంతంలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం నిందితుడిని మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి, కోర్టులో హాజరుపరచగా జడ్జి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. ప్రస్తుతం నిందితుడిని గురజాల సబ్ జైలుకు తరలించారు.

ఈ కేసుపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు
