
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో గురువారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రామాటాకీస్ వీధిలో నివసిస్తున్న షేక్ చిన్న సైదా తన ఇంట్లో టిఫిన్ తయారు చేస్తుండగా, అకస్మాత్తుగా గ్యాస్ లీక్ కారణంగా మంటలు చెలరేగాయి.
ఈ ప్రమాదంలో సైదా తీవ్రంగా గాయపడ్డారు. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి, ఆయన్ని చికిత్స కోసం మాచర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనతో ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. గ్యాస్ వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
