గుంటూరు జిల్లా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆత్మకూరు గ్రామంలో చోరీ జరిగింది. గ్రామానికి చెందిన వెంకటరమణ ఇంట్లో నిన్న రాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇటీవలే వివాహం అయిన వెంకటరమణ దంపతులు వేరే ఊరికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లో చోరీ జరిగినట్లు గుర్తించి మంగళగిరి రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. సుమారు లక్ష రూపాయల నగదు మరియు లక్షన్నర రూపాయల విలువైన బంగారం దొంగలు అపహరించినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Author: myapnews9@gmail.com
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని స్కూళ్లలో సోమవారం (మార్చి 16) నుంచి ఒంటి పూట బడులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విద్యార్థులు ఉదయం 7.45 గంటలకే పాఠశాలలకు వెళ్లి మధ్యాహ్నం 12.30 గంటలకు తిరిగి ఇళ్లకు చేరుకుంటున్నారు.ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ రోజు నుంచి ఒంటి పూట బడులు ప్రారంభమయ్యాయి. ఈ విధానం ఏప్రిల్ 23వ తేదీ వరకు కొనసాగనుండగా, అనంతరం ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి.ఇదిలా ఉండగా, మార్చి నెలలో విద్యార్థులకు వరుస సెలవులు రానున్నాయి. ముఖ్యంగా ఈ వారంలో ఉగాది పండుగతో మొదలై వరుసగా నాలుగు రోజులు సెలవులు ఉండనున్నాయి.మార్చి 19న ఉగాది, మార్చి 20న జుమాత్ ఉల్ విదా, మార్చి 21న రంజాన్ పండుగలు ఉండగా, మార్చి 22న ఆదివారం కావడంతో గురువారం నుంచి ఆదివారం వరకు వరుసగా నాలుగు రోజులు సెలవులు లభించనున్నాయి. దీంతో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లతో…
పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం:కారంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒప్పిచర్ల గ్రామ శివారులో పొలాల్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. నరసరావుపేట పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన స్పెషల్ టీమ్ ఈ దాడులు చేపట్టింది.ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 12 మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1,90,000 నగదు, 9 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు, 14 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. జిల్లాలో ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.పేకాట వంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు పేర్కొన్నారు.
ముస్లింల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మండల కేంద్రంలోని వినుకొండ రోడ్డులో ఉన్న మర్కజ్ మసీద్‌లో పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఆయన ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ముందుగా ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే జూలకంటి స్వయంగా ఆహార పదార్థాలను వడ్డించారు.ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బాలల హక్కుల సాధన కోసం బాల్య వివాహాలను అరికట్టడానికి యువత నడుం బిగించాలని కస్తూరిబా గాంధీ గిరిజన గురుకుల విద్యాలయం ప్రిన్సిపాల్ ఆకుల ఆశాజ్యోతి అన్నారు. సోమవారం కస్తూరిబా గాంధీ గిరిజన గురుకుల పాఠశాలలో బాల్య వివాహాల నిషేధంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా పిలుపు మేరకు మహిళా అభివృద్ధి మరియు సంక్షేమ శాఖ నరసరావుపేట ప్రాజెక్ట్ అధికారి ఎం. ఉమాదేవి ఆదేశాలనుసారం సఖీ వన్ స్టాప్ సెంటర్ టీమ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.ఈ సందర్భంగా ఆకుల ఆశాజ్యోతి మాట్లాడుతూ బాలల రక్షణ, వారి హక్కుల పరిరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం “బేటీ బచావో – బేటీ పడావో” వంటి కార్యక్రమాలను దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నదని తెలిపారు. టీనేజ్ వయస్సు వచ్చేవరకు పెళ్లి చేసుకోవద్దని, చదువు ప్రతి ఒక్కరి హక్కు అని విద్యార్థులకు సూచించారు. తమ తల్లిదండ్రులకు కూడా ఈ…
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం, ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో అమరజీవి స్వర్గీయ శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి హాజరయ్యారు. అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆ మహనీయుడు చేసిన త్యాగాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం చేసిన త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఆయన చూపిన త్యాగస్ఫూర్తి నేటి తరాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, యువజన సంఘం సభ్యులు, మహిళా సంఘం ప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలను రాస్తున్న విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకుని మంచి ఉత్తీర్ణత శాతం సాధించాలని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఆకాంక్షించారు.విద్యార్థులు తమపై నమ్మకం ఉంచుకుని పరీక్షలను ధైర్యంగా రాయాలని, తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్య బోధించిన గురువులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అలాగే తమ ప్రాంతానికి గౌరవం తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అభినందనలు తెలియజేస్తూ, వారికి ఉత్తమ ఫలితాలు రావాలని ఆకాంక్షించారు.అలాగే రాష్ట్ర ప్రభుత్వం, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు అందిస్తున్న వివిధ విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత చదువులు అభ్యసించాలని సూచించారు. విద్య ద్వారా మంచి భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని విద్యార్థులకు ఎమ్మెల్యే తెలిపారు
పల్నాడు జిల్లా మాచర్ల పురపాలక సంఘం సాధారణ కౌన్సిల్ సమావేశం మున్సిపల్ చైర్మన్ మదర్ సాహెబ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి హాజరయ్యారు.పట్టణ అభివృద్ధికి సంబంధించి కౌన్సిల్ సమావేశంలో మొత్తం 18 అంశాలను కౌన్సిల్ సభ్యుల ముందుంచగా, వాటిని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ చివరి కౌన్సిల్ సమావేశానికి హాజరైన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. పట్టణ అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన అంశాలను ఆమోదించినందుకు కౌన్సిల్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకుని పట్టణంలో ఎక్కడా నీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.అలాగే పట్టణంలో చేపడుతున్న రోడ్డు విస్తరణ పనులు ప్రజలకు దీర్ఘకాల ప్రయోజనం కలిగించేలా ఉండాలని, ఒకరికి ఇబ్బంది కలిగినా పదిమందికి ఉపయోగపడేలా రాజీ లేకుండా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలో చికెన్, మటన్,…
పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో విద్యార్థి ఆత్మవిశ్వాసానికి నిదర్శనంగా నిలిచే ఘటన చోటుచేసుకుంది. కాలు విరిగినప్పటికీ పరీక్షను వదులుకోకుండా ధైర్యంగా పరీక్షా కేంద్రానికి చేరుకుని పరీక్ష రాయడానికి హాజరైన విద్యార్థి అందరినీ ఆశ్చర్యపరిచాడు.నడవలేని పరిస్థితిలో ఉన్న తన కుమారుడిని తల్లిదండ్రులు ఆటో చెయిర్ ద్వారా పరీక్షా కేంద్రానికి తీసుకువచ్చారు. చదువుపై ఉన్న మక్కువతో తీవ్ర నొప్పిని కూడా పట్టించుకోకుండా పరీక్ష రాయడానికి వచ్చిన విద్యార్థిని చూసి అక్కడి వారు అభినందించారు.ఇదిలా ఉండగా పిడుగురాళ్ల భాష్యం పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో గుంటూరు తేజశ్రీ అనే విద్యార్థిని పరీక్ష రాస్తుండగా అస్వస్థతకు గురై కిందపడిపోయింది. ఆమెకు గుండెకు రంధ్రం (హార్ట్ సమస్య) ఉండటంతో ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోయినట్లు సమాచారం. వెంటనే అక్కడి సిబ్బంది అప్రమత్తమై ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు.వైద్య సమస్యలు, గాయాలు ఉన్నప్పటికీ విద్యపై ఉన్న ఆసక్తితో పరీక్షలకు హాజరైన విద్యార్థుల పట్టుదల అందరినీ ఆకట్టుకుంది.
పల్నాడు జిల్లా గురజాలలోని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (జీడీసీసీ) శాఖలో గత ప్రభుత్వ కాలంలో జరిగిన భారీ అవినీతి వ్యవహారంపై జిల్లా యంత్రాంగం చర్యలు ప్రారంభించింది. బ్యాంకు నిధుల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో గురజాల శాఖ చీఫ్ మేనేజర్ కే. పున్నారావును సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్, సహకార బ్యాంకు అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.గత ప్రభుత్వ కాలంలో బ్యాంకు నిబంధనలను పక్కనబెట్టి ఇష్టానుసారంగా రుణాలు మంజూరు చేయడం, రికవరీలో నిర్లక్ష్యం చూపడం, కొంతమంది రుణగ్రహీతలతో కుమ్మక్కై బ్యాంకు నిధులను పక్కదారి పట్టించడం వంటి ఆరోపణలు వెలుగులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు.ఈ వ్యవహారంపై ప్రభుత్వం గత నెలలో ప్రత్యేక విచారణకు ఆదేశించగా, విచారణలో గురజాల శాఖ పరిధిలోని కొన్ని పీఏసీఎస్ అధికారులు, బ్యాంకు సిబ్బంది కలిసి సుమారు రూ.11.66 కోట్ల వరకు బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసినట్లు తేలింది. ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా రుణాల మంజూరు చేయడం, రికవరీ చేయకపోవడం…
