
ముస్లింల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి స్పష్టం చేశారు. సోమవారం మండల కేంద్రంలోని వినుకొండ రోడ్డులో ఉన్న మర్కజ్ మసీద్‌లో పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు ఆయన ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ముందుగా ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే జూలకంటి స్వయంగా ఆహార పదార్థాలను వడ్డించారు.
ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
