
పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం:
కారంపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒప్పిచర్ల గ్రామ శివారులో పొలాల్లో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. నరసరావుపేట పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన స్పెషల్ టీమ్ ఈ దాడులు చేపట్టింది.
ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 12 మంది వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.1,90,000 నగదు, 9 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు, 14 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈ దాడులు నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు. జిల్లాలో ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.
పేకాట వంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసులు పేర్కొన్నారు.
