





పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం, ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో అమరజీవి స్వర్గీయ శ్రీ పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి హాజరయ్యారు. అనంతరం పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆ మహనీయుడు చేసిన త్యాగాన్ని ఈ సందర్భంగా స్మరించుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం చేసిన త్యాగం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు. ఆయన చూపిన త్యాగస్ఫూర్తి నేటి తరాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు, యువజన సంఘం సభ్యులు, మహిళా సంఘం ప్రతినిధులు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
