
రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలను రాస్తున్న విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకుని మంచి ఉత్తీర్ణత శాతం సాధించాలని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ఆకాంక్షించారు.
విద్యార్థులు తమపై నమ్మకం ఉంచుకుని పరీక్షలను ధైర్యంగా రాయాలని, తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, విద్య బోధించిన గురువులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అలాగే తమ ప్రాంతానికి గౌరవం తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అభినందనలు తెలియజేస్తూ, వారికి ఉత్తమ ఫలితాలు రావాలని ఆకాంక్షించారు.
అలాగే రాష్ట్ర ప్రభుత్వం, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు అందిస్తున్న వివిధ విద్యా సదుపాయాలను సద్వినియోగం చేసుకుని భవిష్యత్తులో ఉన్నత చదువులు అభ్యసించాలని సూచించారు. విద్య ద్వారా మంచి భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని విద్యార్థులకు ఎమ్మెల్యే తెలిపారు
