మాచర్ల పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయానికి చేరుకున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి దేవస్థానం కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక అర్చనలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమం అనంతరం దేవస్థానం కమిటీ ఆధ్వర్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పల్నాటి ప్రజల కొంగుబంగారంగా నిలిచిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయం తిరుణాళ్లు ఎంతో విశిష్టమైనవని పేర్కొన్నారు. ఈ పవిత్ర సందర్భంలో స్వామివారిని దర్శించుకోవడం తనకు ఆనందంగా ఉందని తెలిపారు. పల్నాడు ప్రాంత ప్రజలు సుఖశాంతులతో, ఐశ్వర్యాలతో, ధనధాన్యాలతో సంతోషంగా జీవించాలని స్వామివారిని ప్రార్థించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు,…
Author: myapnews9@gmail.com
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని జమ్మలమడక రోడ్డులో ఉన్న చంద్రవంక బ్రిడ్జి వద్ద “నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత” కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వాగు పూడికతీత పనులకు శ్రీకారం చుట్టి, అధికారులతో కలిసి 100 రోజుల యాక్షన్ ప్లాన్‌పై సమగ్రంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, భూగర్భ జలాల మట్టాన్ని పెంచేందుకు సాగునీటి వనరుల సంరక్షణ అత్యంత కీలకమని పేర్కొన్నారు. రైతు సంఘాలు ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించాలని సూచిస్తూ అవగాహన కల్పించారు.చంద్రవంక వాగులో పూడికతీత పనులు, సైడ్ వాల్స్ నిర్మాణం, బ్రిడ్జి అభివృద్ధికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసి, వాటి అంచనాలను ప్రభుత్వానికి పంపించామని తెలిపారు. మంజూరైన నిధులను సమర్థంగా వినియోగించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చంద్రవంక వాగులో పూడికతీత పనులు, సైడ్ వాల్స్ నిర్మాణం, బ్రిడ్జి అభివృద్ధికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసి, వాటి అంచనాలను…
మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం ఆత్మకూరు గ్రామంలో ఈస్టర్ పండుగ సందర్భంగా చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పుడా చైర్మన్ చిరుమామిళ్ల మధుబాబు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పుడా చైర్మన్ చిరుమామిళ్ల మధుబాబు మాట్లాడుతూ, ఈస్టర్ పండుగ క్రైస్తవులకు అత్యంత పవిత్రమైనది అని తెలిపారు. యేసుక్రీస్తు పునరుత్థానం ద్వారా ప్రేమ, క్షమ, త్యాగం వంటి గొప్ప విలువలను ప్రపంచానికి తెలియజేశారని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలంటే ప్రతి ఒక్కరూ ఈ విలువలను ఆచరణలో పెట్టాలని సూచించారు.ప్రస్తుతం సమాజంలో పరస్పర గౌరవం, ఐక్యత ఎంతో అవసరమని, అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి జీవించాలన్నారు. ప్రజలందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు.
పల్నాడు జిల్లా దాచేపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. భాస్కర్‌పై వచ్చిన ఆరోపణలపై జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారులు విస్తృత స్థాయిలో విచారణ చేపట్టారు.దాచేపల్లి, గురజాల మండలాల్లో నిర్వహించిన ఈ విచారణకు ప్రాధాన్యత నెలకొంది. ఇటీవల సీఐ పి. భాస్కర్‌ను వీఆర్‌కు పంపిన నేపథ్యంలో ఈ విచారణ కొనసాగుతోంది.విచారణలో భాగంగా సంబంధిత వ్యక్తులను పిలిపించి వివరాలు సేకరించిన అధికారులు, స్థానికంగా వివిధ వర్గాల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కూడా కలిసి వారి వాదనలు విన్నారు.ప్రత్యేక అధికారులు ఎటువంటి పక్షపాతం లేకుండా ప్రతి కోణాన్ని పరిశీలిస్తూ నిజానిజాలు వెలికితీసే దిశగా విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.పారదర్శకంగా, నిష్పక్షపాతంగా అన్ని వర్గాల నుంచి సమాచారం సేకరించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.విచారణ అనంతరం పూర్తి వివరాలతో నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు తెలుస్తోంది.
మాజీ ప్రధాని బాబు జగజీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలో ఆయన విగ్రహానికి బీజేపీ పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఓర్సు క్రాంతి కుమార్, కోపరేటివ్ కన్వీనర్ బొగ్గవరపు మస్తాన్రావు, నియోజకవర్గ సీనియర్ నాయకులు పోకూరి కాశీపతి, పట్టణ ప్రధాన కార్యదర్శి ఏచూరి అమర సురేష్, పట్టణ ఉపాధ్యక్షులు మారం వంశీకృష్ణ, పట్టణ ఉపాధ్యక్షుడు మరియు వికసిత్ భారత్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ శివకోటయ్య నాయక్, పట్టణ యువమోర్చా నాయకులు జెట్టిపల్లి గణపతి తదితరులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ప్రజారోగ్యంపై అవగాహన పెంపొందించే దిశగా ఒక మంచి కార్యక్రమం ప్రారంభమైంది. మాచర్ల పట్టణంలోని వై.యస్.ఆర్.సి.పి కార్యాలయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా నిర్వహించనున్న HPV వ్యాక్సిన్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను వై.యస్.ఆర్.సి.పి జిల్లా అధ్యక్షులు శ్రీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మాచర్ల శ్రీను, వైస్ ప్రెసిడెంట్ ఖలీల్, ప్రేమ్ కుమార్, గుంటూరు జిల్లా జాయింట్ సెక్రెటరీ మణికంఠ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు మహిళల ఆరోగ్య రక్షణలో HPV వ్యాక్సిన్ ఎంతో కీలకమని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
స్వాతంత్య్ర ఉద్యమ నేత, ప్రముఖ సంఘసంస్కర్త, భారత మాజీ ఉప ప్రధాన మంత్రి డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా మాచర్ల పట్టణంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని, బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ దేశ స్వాతంత్య్ర పోరాటంలో కీలక పాత్ర పోషించడమే కాకుండా, సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేసిన మహానేత అని కొనియాడారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ఆయన చేసిన సేవలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. ప్రస్తుత తరానికి ఆయన ఆలోచనలు మార్గదర్శకంగా నిలుస్తాయని, ముఖ్యంగా యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని సమాజ సేవలో ముందుండాలని పిన్నెల్లి పిలుపునిచ్చారు. దేశ నిర్మాణంలో బాబు జగ్జీవన్ రామ్…
పల్నాడు జిల్లా మాచర్ల పట్టణం ఆదివారం సామాజిక న్యాయం, సమానత్వం విలువలను ప్రతిబింబించే వేదికగా మారింది. భారత మాజీ ఉప ప్రధాన మంత్రి, దళితుల హక్కుల కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి.ఈ సందర్భంగా మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు బాబు జగ్జీవన్ రామ్ సేవలను స్మరించుకున్నారు. విగ్రహం వద్ద కొద్దిసేపు గంభీర వాతావరణం నెలకొనగా, అనంతరం ప్రజలతో కలిసి కార్యక్రమం ఉత్సాహంగా కొనసాగింది.వేడుకల అనంతరం నిర్వహించిన పులిహార పంపిణీ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సామాన్య ప్రజలతో కలిసి ఎమ్మెల్యే స్వయంగా పాల్గొనడం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రజలతో మమేకమవుతూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా నాయకత్వానికి కొత్త సందేశం ఇచ్చారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ,“బాబు జగ్జీవన్ రామ్…
పల్నాడు జిల్లా వెల్దుర్తి పట్టణంలో ఆరోగ్యంపై అవగాహన కల్పించే కార్యక్రమం జరిగింది. ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని మున్సిపల్ కమిషనర్ వేణుబాబు, తహసిల్దార్ రాజశేఖర్ నాయక్ పేర్కొన్నారు.ఆదివారం పట్టణంలోని ఎస్‌కేబీఆర్ క్రీడా మైదానంలో, ఎమ్మెస్సార్ టౌన్షిప్ డెవలపర్ మద్దిగపు శివరామిరెడ్డి సహకారంతో రూ.50,000 విలువైన వ్యాయామ పరికరాలను బహుకరించారు. ఈ పరికరాలను కమిషనర్ వేణుబాబు, తహసిల్దార్ రాజశేఖర్ నాయక్ ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వ్యాయామం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని తమ దినచర్యలో భాగంగా మార్చుకోవాలని సూచించారు. క్రీడా మైదానం అభివృద్ధికి వాకర్స్ అసోసియేషన్ సభ్యుల కృషి అభినందనీయమని అన్నారు. ఇదే సందర్భంగా తహసిల్దార్ రాజశేఖర్ నాయక్ రూ.5,000ను వాకర్స్ అసోసియేషన్‌కు అందజేసి, ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మద్దిగపు చిన్న వెంకటరామిరెడ్డి, కొమేరా దుర్గారావు, కుర్రి…
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో సంచలనం రేపిన ఘటన చోటుచేసుకుంది. మాచర్ల పట్టణ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సిఐ) తురక వెంకటరమణపై సస్పెన్షన్ వేటు పడింది.ఇటీవల మాచర్లలో సంచలనం సృష్టించిన కామనబోయిన చౌడేశ్వరి హత్య కేసు దర్యాప్తులో నిర్లక్ష్యం వహించారనే ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.కేసు దర్యాప్తులో ఆలస్యం, విధుల్లో నిర్లక్ష్యం, అలాగే అవినీతి ఆరోపణలు వెలుగులోకి రావడంతో శాఖాపరమైన చర్యల భాగంగా సస్పెన్షన్ విధించినట్లు తెలుస్తోంది.ఈ ఘటన జిల్లాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది.
