
పల్నాడు జిల్లా వెల్దుర్తి పట్టణంలో ఆరోగ్యంపై అవగాహన కల్పించే కార్యక్రమం జరిగింది. ప్రతిరోజు వ్యాయామం చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని మున్సిపల్ కమిషనర్ వేణుబాబు, తహసిల్దార్ రాజశేఖర్ నాయక్ పేర్కొన్నారు.
ఆదివారం పట్టణంలోని ఎస్‌కేబీఆర్ క్రీడా మైదానంలో, ఎమ్మెస్సార్ టౌన్షిప్ డెవలపర్ మద్దిగపు శివరామిరెడ్డి సహకారంతో రూ.50,000 విలువైన వ్యాయామ పరికరాలను బహుకరించారు. ఈ పరికరాలను కమిషనర్ వేణుబాబు, తహసిల్దార్ రాజశేఖర్ నాయక్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వ్యాయామం చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గి శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యాయామాన్ని తమ దినచర్యలో భాగంగా మార్చుకోవాలని సూచించారు.

క్రీడా మైదానం అభివృద్ధికి వాకర్స్ అసోసియేషన్ సభ్యుల కృషి అభినందనీయమని అన్నారు. ఇదే సందర్భంగా తహసిల్దార్ రాజశేఖర్ నాయక్ రూ.5,000ను వాకర్స్ అసోసియేషన్‌కు అందజేసి, ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మద్దిగపు చిన్న వెంకటరామిరెడ్డి, కొమేరా దుర్గారావు, కుర్రి సాయి మార్కొండా రెడ్డి, పులుసు లక్ష్మారెడ్డి, యనమదల వెంకటరామయ్యతో పాటు వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కొలిశెట్టి నాగేశ్వరరావు, బొడ్డు చెంచి రెడ్డి, గోపవరపు నాగేశ్వరరావు, నారాయణ రెడ్డి, బత్తుల మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
