
పల్నాడు జిల్లా దాచేపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ పి. భాస్కర్‌పై వచ్చిన ఆరోపణలపై జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారులు విస్తృత స్థాయిలో విచారణ చేపట్టారు.
దాచేపల్లి, గురజాల మండలాల్లో నిర్వహించిన ఈ విచారణకు ప్రాధాన్యత నెలకొంది. ఇటీవల సీఐ పి. భాస్కర్‌ను వీఆర్‌కు పంపిన నేపథ్యంలో ఈ విచారణ కొనసాగుతోంది.
విచారణలో భాగంగా సంబంధిత వ్యక్తులను పిలిపించి వివరాలు సేకరించిన అధికారులు, స్థానికంగా వివిధ వర్గాల అభిప్రాయాలను తెలుసుకున్నారు. అలాగే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని కూడా కలిసి వారి వాదనలు విన్నారు.
ప్రత్యేక అధికారులు ఎటువంటి పక్షపాతం లేకుండా ప్రతి కోణాన్ని పరిశీలిస్తూ నిజానిజాలు వెలికితీసే దిశగా విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.
పారదర్శకంగా, నిష్పక్షపాతంగా అన్ని వర్గాల నుంచి సమాచారం సేకరించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
విచారణ అనంతరం పూర్తి వివరాలతో నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు తెలుస్తోంది.
