
మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం ఆత్మకూరు గ్రామంలో ఈస్టర్ పండుగ సందర్భంగా చర్చిలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పుడా చైర్మన్ చిరుమామిళ్ల మధుబాబు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పుడా చైర్మన్ చిరుమామిళ్ల మధుబాబు మాట్లాడుతూ,

ఈస్టర్ పండుగ క్రైస్తవులకు అత్యంత పవిత్రమైనది అని తెలిపారు. యేసుక్రీస్తు పునరుత్థానం ద్వారా ప్రేమ, క్షమ, త్యాగం వంటి గొప్ప విలువలను ప్రపంచానికి తెలియజేశారని పేర్కొన్నారు. సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలంటే ప్రతి ఒక్కరూ ఈ విలువలను ఆచరణలో పెట్టాలని సూచించారు.
ప్రస్తుతం సమాజంలో పరస్పర గౌరవం, ఐక్యత ఎంతో అవసరమని, అన్ని మతాల ప్రజలు కలిసిమెలిసి జీవించాలన్నారు. ప్రజలందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు.
