పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని జమ్మలమడక రోడ్డులో ఉన్న చంద్రవంక బ్రిడ్జి వద్ద “నీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యత” కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వాగు పూడికతీత పనులకు శ్రీకారం చుట్టి, అధికారులతో కలిసి 100 రోజుల యాక్షన్ ప్లాన్‌పై సమగ్రంగా చర్చించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, భూగర్భ జలాల మట్టాన్ని పెంచేందుకు సాగునీటి వనరుల సంరక్షణ అత్యంత కీలకమని పేర్కొన్నారు. రైతు సంఘాలు ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషించాలని సూచిస్తూ అవగాహన కల్పించారు.
చంద్రవంక వాగులో పూడికతీత పనులు, సైడ్ వాల్స్ నిర్మాణం, బ్రిడ్జి అభివృద్ధికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసి, వాటి అంచనాలను ప్రభుత్వానికి పంపించామని తెలిపారు. మంజూరైన నిధులను సమర్థంగా వినియోగించేందుకు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

అలాగే స్థానికంగా ఉన్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.